
ప్రపంచ ఆర్చరీ చరిత్రలో సంచలనం క్రియేట్ అయ్యింది. ప్యారా ఆర్చరీ చాంపియన్షిప్ లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ను ఓడించి ఇండియా ఆర్చర్ శీతల్ దేవి హిస్టరీ క్రియేట్ చేసింది. సంకల్పం తోడుంటే విజయం దాసోహం అవుతుందనే సామెతను నిజం చేసింది. తుర్కియే ఆర్చర్.. వరల్డ్ నెంబర్ 1 ఒజ్నూర్ కురే గిర్డీ పై 146-143 స్కోర్ తో గెలిచి బంగారు పథకం సాధించి చరిత్ర సృష్టించింది.
చేతులు లేకపోయినా:
శీతల్ దేవీకి రెండు చేతులు లేవు. పాదాలు, గదవ సాయంతోనే షూట్ చేస్తుంది. ఈ గెలుపుతో తన అకౌంట్లో మూడవ మెడల్ ను వేసుకుంది షీతల్. గతంలో కంపౌండ్ ఈవెంట్ లో బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి.
మొదటి నుంచి శీతల్ కు, గిర్డీకి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఫస్ట్ ఎండ్ లో 29 స్కోర్ తో టై అయ్యింది. సెకండ్ రౌండ్ లో 30-27 తేడాతో శీతల్ లీడ్ లోకి వచ్చింది. థర్డ్ రౌండ్ లో కూడా టై కాగా.. ఫోర్త్ రౌండ్ లో 28 పాయింట్లు సాధించి.. రెండు పాయిట్ల లీడ్ తో 116-114 శీతల్ ముందుకెళ్లింది.
ఫైనల్ రౌండ్ లో ఎలాంటి మిస్టేక్ చేయకుండా... మూడు యారోస్ ను ఫ్లాలెస్ గా కొట్టి 30 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ సాధించింది.