ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు

ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు

షాంగై :  ఆర్చరీ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఆర్చర్లు అదరగొడుతున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్ టీమ్ విభాగాల్లో ఫైనల్ చేరుకున్న ఇండియా జట్లు రెండు పతకాలు ఖాయం చేసుకున్నాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవెంట్ లో  అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలచంద్ర, ప్రియాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు  సెమీఫైనల్లో 235–233 స్కోరుతో టాప్ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌత్ కొరియాను ఓడించి ఫైనల్ చేరింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.

మరోవైపు వరల్డ్ చాంపియన్, టాప్ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా బరిలోకి దిగిన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్ కూడా అంచనాలను అందుకుంది.  వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదితి స్వామితో కూడిన జట్టు   క్వార్టర్ ఫైనల్లో 253–230తో టర్కీని,  సెమీ ఫైనల్లో 235–230తో ఇస్తోయినియాను చిత్తు చేసింది. ఫైనల్లో ఇటలీతో గోల్డ్ మెడల్ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు రెడీ అయింది. ఇక, మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బొమ్మదేవర ధీరజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేషనల్ రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మూడో స్థానం సాధించి ఫైనల్ చేరుకున్నాడు.

క్వాలిఫికేషన్ లో 693 పాయింట్లు సాధించిన అతను తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట (689) పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ (672) ఏడు, ప్రవీణ్ జాదవ్ (672) 25వ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అకింతా భకట్, భజన్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దీపిక కుమారి, కోమలికా బారి మెయిన్ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయ్యారు.