QRSAM సిస్టమ్ 6 విమాన పరీక్షలు విజయవంతం

QRSAM సిస్టమ్ 6 విమాన పరీక్షలు విజయవంతం

బాలాసోర్(ఒడిశా): డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మరో ఘనత సాధించింది. భూమ్మీది నుంచి గాల్లోని లక్ష్యాలను చేధించగలిగే మిసైళ్లను(క్యూఆర్ఎస్ఏఎం) ఇండియన్ ఆర్మీ, డీఆర్డీవో కలిసి గురువారం  విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీరంలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​ నుంచి క్యూఆర్ఎస్ఏఎం పరీక్షను నిర్వహించినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. ట్రయల్స్​లో భాగంగా ఆకాశంలో ఉన్న వస్తువును మిసైల్ కచ్చితత్వంతో పేల్చిందని చెప్పారు.

స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్​తో కూడిన మిసైల్, మొబైల్ లాంచర్, పూర్తి ఆటోమేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, నిఘా, మల్టిపుల్ ఫంక్షనల్ రాడార్​తో పాటు అన్ని సబ్​సిస్టమ్స్​ను పరీక్షించామన్నారు. ఈ మిసైల్ 30 కిలోమీటర్ల పరిధిలో 10 కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఎరిగే టార్గెట్​లను చేధిస్తుంది. శత్రుదేశాల విమానాలు, డ్రోన్లను గుర్తించి కూల్చివేయడంలో ఉపయోగపడనుంది. త్వరలోనే ఈ మిసైళ్లను ఇండియన్ ఆర్మీకి అందజేయనున్నారు.