
హైదరాబాద్: ఎల్వోసీ వద్ద ఉన్న పాక్ ఉగ్రశిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అనుమానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సంకేతాల ఆధారంగానే .. భారత వైమానిక దళం ఎల్వోసీ వెంట ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళం.. ఎల్వోసీ వద్ద దాడి చేయడంతో.. ఆ బోర్డర్ వెంట అప్రమత్తత ప్రకటించారు. సరిహద్దు సైనికులు హై అలర్ట్ లో ఉన్నారు. దాడిలో మొత్తం 12 మిరేజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
ఆ విమానాలు ఉగ్ర శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు డ్రాప్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. లేజర్ గైడెడ్ బాంబులతో ఈ దాడి చేసినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన శిబిరాలపై దాడి జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.