సైనికుల ఫోన్లలో సోషల్ మీడియాకు నో.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా సహా 87 యాప్స్‌పై నిషేధం

సైనికుల ఫోన్లలో సోషల్ మీడియాకు నో.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా సహా 87 యాప్స్‌పై నిషేధం
  • భద్రతా కారణాలతో భారత సైన్యం కొత్త అడ్వైజరీ

న్యూఢిల్లీ: సైనిక సిబ్బంది మొబైల్ ఫోన్లలో 87 మొబైల్ అప్లికేషన్ల వినియోగంపై నిషేధం విధిస్తూ భారత సైన్యం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్, టిక్ టాక్, పబ్ జీ వంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వినియోగించవద్దని మంగళవారం ఆదేశించింది. సున్నితమైన సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సైన్యం పేర్కొంది. గతంలో నిషేధించిన చైనా యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు మరిన్ని పాపులర్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఈ జాబితాలో చేర్చారు. 

సైనికులు తమ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ల నుంచి ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో సోషల్ మీడియా, డేటింగ్, పబ్ జీ గేమింగ్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్, టిండర్, హింజ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, వై చాట్ వంటివి ఇందులో ఉన్నాయి. జులై 15 లోపు ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నింటినీ తొలగించాలని గడువు విధించింది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

విదేశీ గూఢచారి సంస్థలు సోషల్ మీడియా ద్వారా సైనికులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సైన్యం తెలిపింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. సైన్యం విడుదల చేసిన జాబితాలో జూమ్, ట్రూ కాలర్ వంటి యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా ఉన్నాయి. గూగుల్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ సేవలను వాడవద్దని సూచించింది.