- ఉద్దేశపూర్వకంగానే భద్రత తొలగించారని ఆరోపణ
- 1991లోనే తండ్రి భద్రతపై హెచ్చరించానన్న రాహుల్
- బిహార్‌లో రాజీవ్‌పై రాళ్ల దాడిని గుర్తుచేసుకున్న సోనియా
- నానమ్మ హత్య తర్వాత అమ్మ భయంతో గడిపింది: ప్రియాంక
- ‘బిలాంగింగ్’పై ముగ్గురి సంభాషణ వీడియోలో వెల్లడి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఎస్పీజీ సెక్యూరిటీని ఉద్దేశపూర్వకంగానే తొలగించారని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన హత్యకు దారితీసేలా అప్పటి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను పక్కన పెట్టిందని విమర్శించారు. 1991లో తండ్రి భద్రతపై తాను ముందే ఆందోళన వ్యక్తం చేశానని రాహుల్ గుర్తు చేసుకున్నారు.
మీరాలం చెరువు అభివృద్ధి పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెప్పగా, చెరువులో ఏండ్లుగా పేరుకుపోయిన పూడికను కూడా తొలగించాలని సీఎం ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతిని తెలుసుకుని పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. గండిపేట దగ్గర నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాలను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండు మార్గాల్లో పీఆర్‌టీఎస్
సిటీలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పాడ్ ట్యాక్సీ) ఫేజ్–1కు సంబంధించిన టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదికను అధికారులు సీఎంకు వివరించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గం మీదుగా బయోడైవర్సిటీ వరకు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియెట్, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు అలైన్‌మెంట్ ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలను తెలిపారు. నెక్లెస్ రోడ్, రాయదుర్గం, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోలకు అనువైన స్థలాలు గుర్తించి అధ్యయనం చేయాలని, డిపోల దగ్గర మల్టీలెవెల్ పార్కింగ్ ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. రూట్లు, డిపోలు సహా అన్ని అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే ప్రణాళికలు ఖరారు చేయాలన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ దగ్గర ఫుట్‌బ్రిడ్జి డిజైన్లను పరిశీలించిన సీఎం, దాని సమీపంలో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కోహెడ మార్కెట్‌లో నాణ్యతపై రాజీ వద్దు
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగం పెంచాలని, మార్కెట్ పనులతో పాటే రోడ్ల నిర్మాణమూ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పనుల వివరాలు తెలుసుకున్నారు. చెరువుల దగ్గర అవసరమైన చోట మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించగా, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, సిటీలోని మెట్ల బావుల పునరుద్ధరణకూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదరికం చూసి షాక్ అయ్యా
1968లో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడి పేదరికాన్ని చూసి షాక్‌కు గురయ్యానని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. తన జీవిత అనుభవాలతో ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకాన్ని రాశారు. తన పిల్లలు తన సహనాన్ని పరీక్షిస్తుంటారని, అయితే వాళ్లే తనకు బలం, సంతోషమని చెప్పారు.
