- జీటీఏ-6 గేమ్ ఆడుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సెటైర్లు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పేరుతో కేంద్రం భారీ దోపిడీకి పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. దీన్ని 'గ్రాండ్ థెఫ్ట్ వితౌట్ ఆటో' (వాహనం లేని భారీ దోపిడీ)గా అభివర్ణించారు. తన యూట్యూబ్ ఛానల్లో 'గ్రాండ్ థెఫ్ట్ ఆటో-6' (జీటీఏ-6) గేమ్ ఆడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 13 ఏళ్లలో దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయని, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డంకులు ఏర్పడ్డాయని అన్నారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
