సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి లీగల్ నోటీసులు

సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియా గాంధీకి లీగల్ నోటీసులు

న్యూఢిల్లీ: వీడీ సావర్కర్ మునిమనవడు సత్యకి సావర్కర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లీగల్ నోటీసులు పంపారు. ఆమె రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో సావర్కర్ జీవితాన్ని, సిద్ధాంతాలను తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. సావర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చేసిన వ్యాఖ్యలకు గాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తప్పులను సరిదిద్దడంతో పాటు వివరణ ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేశారు. సాత్యకి సావర్కర్ తరఫున న్యాయవాది సంగ్రామ్ కోల్హట్కర్ ఈ నోటీసును జారీ చేశారు. హార్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలోని 201, 443 పేజీల్లో ఉన్న అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.