మంచుకొండల్లో కూలిన భారత ఆర్మీ హెలికాఫ్టర్

మంచుకొండల్లో కూలిన భారత ఆర్మీ హెలికాఫ్టర్

భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. బొండిలా పట్టణానికి సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది.  ఈ ప్రమాదంలో ఫైలెట్ల ఆచూకీ తెలియడం లేదు. ప్రస్తుతం వారి కోసం ఉన్నతాధికారులు అన్ని చోట్ల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

మార్చి 16న ఉదయం దాదాపు 9 గంటల 15 నిమిషాల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో చీతా హెలికాఫ్టర్ సంబంధాన్ని కోల్పోయినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్, PRO డిఫెన్స్ గౌహతి చెప్పారు.