డివైజ్‌లతో కరోనాపై ఇండియన్ ఆర్మీ యుద్ధం

డివైజ్‌లతో కరోనాపై ఇండియన్ ఆర్మీ యుద్ధం

కరోనాపై పోరాటంలో ఇండియన్ ఆర్మీ, నేవీ, డీఆర్ డీవో సైంటిస్టులు కూడా చేతులు కలిపారు.కొవిడ్ హాస్పిటళ్లలో మెడికల్ స్టాఫ్, పేషెంట్లకు అవసరమైన కీలక పరికరాలను అందిస్తూ ఈ రకంగానూతాము దేశ రక్షణ కోసం పాటుపడతామని చాటిచెప్తున్ నారు.రిమోట్ కంట్రోల్ ట్రాలీ 

కరోనా పేషెంట్ల వార్డుల్లో డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ​ఉపయోగించుకునేందుకు వీలుగా ఇండియన్ ఆర్మీకి చెందిన కోర్ ఆఫ్​ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్(ఈఎంఈ) రీసెర్చర్లు సరికొత్త రిమోట్ కంట్రోల్ ట్రాలీని తయారు చేశారు. ఒక పక్క చేతులు కడుక్కునేందుకు వాష్ బేసిన్, మరో పక్క డస్ట్ బిన్, మధ్యలో వస్తువులు ఉంచేందుకు ప్లేస్ కూడా ఇందులో ఉంటాయి. దీనిని వాడటం వల్ల కరోనా వార్డులలో మెడికల్ స్టాఫ్​కు ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గుతుందని చెప్తున్నారు.

దీనితో ఒకేసారి ఆరుగురికి ఆక్సిజన్ 

కరోనా కారణంగా ఇప్పుడు హాస్పిటళ్లలో ఆక్సిజన్ ఫీడర్లకు తీవ్రమైన కొరత ఉంది. ఒక్కో ఫీడర్ నుంచి ఒకరికే ఆక్సిజన్ పెట్టేందుకు వీలవుతుండటం ఇబ్బందిగా మారింది. అందుకే.. ఇండియన్ నేవీ రీసెర్చర్లు ‘పోర్టబుల్ ఆక్సిజన్ మల్టీఫీడర్’ను రూపొందించారు. దీంతో ఎమర్జెన్సీ టైంలో ఒకే సిలిండర్ నుంచి ఒకేసారి ఆరుగురికి ఆక్సిజన్ అందించవచ్చు. కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో ఇది కూడా కీలక అస్త్రంగా మారింది.

శాంపిల్ కలెక్షన్ కోసం కొవ్ శాక్

కరోనా లక్షణాలతో  వచ్చిన వారి నుంచి శాంపిల్ తీసుకునే టైంలోనూ ఇన్ఫెక్షన్ ముప్పు ఉంటుంది. దీనిని తప్పించేందుకు హైదరాబాద్ లోని డీఆర్ డీఎల్ సైంటిస్టులు కియోస్క్ తయారు చేశారు. కొవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్ (కొవ్ శాక్) అనే ఈ కియోస్క్ లోకి పేషెంట్ వెళ్లి తనంతట తానుగా శాంపిల్ ఇవ్వొచ్చు. పేషెంట్ వెళ్లాక ఈ కియోస్క్ తనంతట తానుగానే డిస్ ఇన్ఫెక్టెంట్లను స్ప్రే చేసుకుని, యూవీ లైట్ ను ఆన్ చేసుకుని 70 సెకన్లలోనే శానిటైజ్ చేసుకుంటుంది.

యూవీసీ లైట్‌‌తో వైరస్‌‌ను చంపేస్తది

శానిటైజర్ కాకుండా అల్ట్రా వయొలెట్ సీ లైట్ తో వైరస్ ను చంపే ప్రత్యేక శానిటైజేషన్ బాక్స్ ను డీఆర్ డీవోకు చెందిన డీఐపీఏఎస్, ఇన్ మాస్ ల్యాబోరేటరీ సైంటిస్టులు తయారు చేశారు. దీంతోపాటు చేతితో పట్టుకుని శానిటైజ్ చేసేందుకు ఉపయోగపడే డివైస్ ను కూడా వీరు రూపొందించారు. ఇవి రెండూ యూవీ సీ(254 నానోమీటర్స్ వేవ్ లెంత్ తో ఉండే యూవీ లైట్) లైట్ తో వైరస్ ను చంపుతాయి. కరోనా వైరస్ లోని జెనెటికల్ మెటీరియల్ ను నాశనం చేసేందుకు ఇవి చాలా బాగా పనిచేస్తాయట.

ఆటోమేటిక్ శానిటైజర్ బాక్స్

ఆటోమేటిక్ గా శానిటైజర్ ను విడుదలచేసే కాంటాక్ట్ లెస్ శానిటైజర్ డిస్పెన్సర్ ను ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ సంస్థ తయారు చేసిం ది. షాపింగ్ మాల్స్, ఆఫీసుల వద్ద దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. లోపలికి వెళ్లే వాళ్లు దీని కింద చేతులు చాచితే శానిటైజర్ సొల్యూషన్ విడుదలవుతుంది.