ఫేస్ బుక్ ను కూడా నిషేధించిన భారత సైన్యం

ఫేస్ బుక్ ను కూడా నిషేధించిన భారత సైన్యం

భద్రతా కారణాల దృష్ట్యా…89 యాప్ లను వినియోగించరాదని భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ లు కూడా ఉన్నాయి. సైన్యంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు బ్యాన్ చేసిన 89 యాప్ లలో ఏ ఒక్క దాన్ని కూడా ఉపయోగించకూడదని… ఫోన్లలో ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించింది. ఈనెల 15లోగా ఈ యాప్ లన్నింటినీ డిలీట్ చేయాలంటూ లిస్టును విడుదల చేసింది. హనీట్రాప్, భద్రతా ఉల్లంఘన కారణంగా సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైన్యం హెచ్చరించింది.