ఉగ్రవాదుల భరతం పట్టే ఆర్మీ డాగ్ సైన్యం

ఉగ్రవాదుల భరతం పట్టే ఆర్మీ డాగ్ సైన్యం

ఆర్మీ డాగ్స్  ఉగ్రవాదుల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండియన్ ఆర్మీ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ తో  ఆడియో, వీడియో సర్వేలైన్స్ సిస్టమ్ ను తయారు చేస్తుంది.

ఈ సర్వేలైన్స్ సిస్టమ్ ను లెఫ్టినెంట్ కల్నల్ వి కమల్ రాజ్ తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ రాజ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల బేస్ క్యాంపుల్లో ఎక్కవ మంది సైనికులు వీరమరణం పొందుతుంటారు. అయితే సైనికుల ప్రాణాల్ని కాపాడేందుకు ఆడియో, వీడియో సర్వేలైన్స్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆర్మీ కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

కుక్కలకు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ ను అమర్చి వాటికి సర్వేలైన్స్ ను అమర్చనున్నట్లు తెలిపారు. దీంతో కిలోమీటర్ దూరంలో ఉన్న ఉగ్రవాదులు ఏం మాట్లాడుకుంటుంది. ఏం చేస్తున్నారనే మొత్తం ఆడియో, వీడియో రికార్డ్ అవుతుందన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా ఈ పరికరాలు పనిచేస్తున్నట్లు చెప్పారు.

జర్మన్ షెపర్డ్స్, డోబెర్మాన్ పిన్చర్స్, గ్రేట్ స్విస్ మౌంటైన్ డాగ్స్, లాబ్రడార్స్, బెల్జియన్ మాలినోయిస్ వంటి విదేశీ జాతులకు చెందిన కుక్కలే కాకుండా స్వదేశీ కుక్కలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.

మీరట్‌లో ఆర్మీ క్యాంప్ బేస్  అధికారులు కుక్కలకు పెట్రోలింగ్, గార్డింగ్, ట్రాకింగ్, పర్వతాల్లో రెస్క్యూ ఆపరేషన్, పేలుడు, లోతట్టు ప్రాంతాలను గుర్తించేలా ట్రైనింగ్ ఇస్తున్నారు.