జమ్మూ కశ్మీర్ పూంచ్లో హైఅలర్ట్.. ఉగ్ర దాడిలో చైనా హస్తం!

జమ్మూ కశ్మీర్ పూంచ్లో హైఅలర్ట్.. ఉగ్ర దాడిలో చైనా హస్తం!

జమ్మూ కశ్యీర్ లోని పూంచ్ లో హైఅలర్ట్ ప్రకటించారు ఆర్మీ ఆధికారులు. ఉగ్రదాడి జరిగిన స్థలం సహా.. పూంచ్ పరిసర ప్రాంతాలన్నీ పారామిలటరీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆర్మీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అయితే, ఈ దాడిని తామే చేసినట్లు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ సంస్థకు జైషే మహ్మద్ సంస్థతో అనుబంధాలు ఉన్నాయి.

గురువారం (ఏప్రిల్ 20) జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. భారీగా వర్షం కురుస్తున్న టైంలో నలువైపుల నుంచి ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

అయితే, ఘటనా స్థలంలో చైనాకు సంబంధించిన బుల్లెట్లను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. దాంతో ఉగ్ర దాడిలో చైనా హస్థం ఉందా? ఉగ్ర వాదులతో చేతులు కలిపే చైనా ఈ దుస్సాహసానికి పాల్పడిందా అన్న కోణంలో ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.