
భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్రం పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయనుంది.
సరిహద్దు ప్రాంతాల్ని మరితం బలోపేతం చేసేందుకు కేంద్రం అమ్మలపొదిలో అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ ఇజ్రాయిల్ నుంచి స్పైక్ ట్యాంకర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండియా టుడే తన కథనంలో తెలిపింది.
ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ పవర్స్ కింద సుమారు రూ.500కోట్లతో 12 స్పైక్ లాంచర్ యూనిట్లు, 200కి పైగా క్షిపణిలను పంపించాలని ఇండియన్ ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు ఇజ్రాయిల్ ను కోరినట్లు సమాచారం.
కాగా బాలకోట్ వైమానిక దాడుల తరువాత అత్యవసర ఆర్థిక అధికారాల కింద గతేడాది పెద్ద సంఖ్యలో క్షిపణులు మరియు లాంచర్లు కొనుగోలు చేసింది భారత్. ఈ క్షిపణులను పాకిస్తాన్ ముందు భాగంలో మొహరించగా.. తాజాగా రూ.500కోట్లతో ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేయనున్న క్షిపణులను చైనా భూభాగం ముందు భారత భూభాగంలో ఏర్పాటు చేయనుంది.