
కశ్మీర్ లోయలో ఆర్మీ తొలిసారిగా పాఠశాల విద్యార్థినులకు సైక్లింగ్ నిర్వహించింది. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, స్థానికులతో ఆర్మీ సత్సంబంధాలు పెంచుకునే క్రమంలో ఈ సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం, క్రీడా నైపుణ్యాలు పెంచుకునేలా ఆర్మీ ప్రోత్సాహిస్తోంది. సైక్లింగ్లో కశ్మీర్ లోని పలు స్కూళ్లకు చెందిన 37 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. 25 కిలోమీటర్లు సాగిన ఈ సైక్లింగ్ ను జనరల్ కమాండింగ్ ఆఫీసర్ జెండా ఊపి ప్రారంభించారు. స్పోర్ట్స్ తో ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంచేలా ఆర్మీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సైక్లింగ్ లో పాల్గొన్న విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మీకి థాంక్స్ చెప్పారు స్టూడెంట్స్.
Jammu & Kashmir: Indian Army organised a cycling expedition for girls, in Doda yesterday. Around 35 girls from different schools of Doda participated in the event which commenced at Bhaderwah and concluded at Pul Doda. pic.twitter.com/HpqIyg79w8
— ANI (@ANI) May 5, 2019