పాక్ ఆర్మీనే టార్గెట్: నయా స్నైపర్ రైఫిల్స్

పాక్ ఆర్మీనే టార్గెట్: నయా స్నైపర్ రైఫిల్స్

లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) లో పాకిస్తాన్ చేసే ఆగడాలకు చెక్ పెట్టడానికి భారత ఆర్మీ రెడీ అయింది. ఇకపై పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఫైరింగ్ చేస్తే సీదా బుల్లేట్ పాక్ జవాన్ తలలో దూసుకుపోయేలా చర్యలు చేపట్టింది కేంద్ర సర్కార్. ఇందుకు గానూ.. జమ్ము కశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తం… అత్యాదునిక ‘లాపువా మాగ్నమ్’ అనే  స్నైఫర్ లతో ఒక టీం ను రెడీ చేసింది. అటునుంచి ఫైరింగ్ అవగానే మన స్నైఫర్స్  డైరెక్ట్ గా పాక్ సైనికులను టార్గెట్ చేయనున్నారు.

ఈ అత్యాధునిక ‘లాపువా మాగ్నమ్’ అనే స్నైఫర్ రైఫిల్స్ ను ఇటాలియన్ కు చెందిన బెరెట్టా కంపెనీ నుండి  దిగుమతి చేసుకుంది భారత ఆర్మీ. ఈ రైఫిల్ ను ఇరాక్, అఫ్గనిస్తాన్ లలో తీవ్రవాదులను ఏరివేయడానికి ఉపయోగించారు.

గత నెలలో జరిగిన పుల్వామా దాడితో సీరియస్ అయింది భారత ప్రభుత్వం దీంతో.. మరోసారి ఎటువంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఎదురుదాడి ఉండాలని బావిస్తున్నట్టు తెలుస్తుంది.