స్టార్టప్​ల కోసం 10 సిటీలలో .. ఇండియన్​ బ్యాంక్​ స్పెషల్​ సెల్

స్టార్టప్​ల కోసం 10 సిటీలలో .. ఇండియన్​ బ్యాంక్​ స్పెషల్​ సెల్

చెన్నై: దేశంలోని పది సిటీలలో స్టార్టప్​ల కోసం స్పెషల్​ సెల్స్​ ఏర్పాటు చేసినట్లు ఇండియన్​ బ్యాంక్​ బుధవారం వెల్లడించింది. స్టార్టప్​లకు ఉండే ప్రత్యేక అవసరాలను ఇవి నెరవేరుస్తాయని పేర్కొంది. అహ్మదాబాద్​, బెంగళూరు, కోయంబతూర్​, చెన్నై, గుర్​గావ్​, న్యూఢిల్లీ, గువహతి, హైదరాబాద్​, కాన్పూర్​, ముంబై సిటీలలో ఈ ప్రత్యేక స్టార్టప్​ సెల్స్​ ఏర్పాటయినట్లు తెలిపింది. స్టార్టప్​ల ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బ్యాంకింగ్​ ప్రొడక్టులను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నట్లు ఇండియన్​ బ్యాంక్​ వివరించింది. 

పేమెంట్​ గేట్​వేస్​, కార్పొరేట్​ క్రెడిట్​ కార్డ్​ ఫెసిలిటీల వంటి వాటిని అదనంగా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశంలో స్టార్టప్​ ఎకో సిస్టమ్​ బలపడటానికి ఈ విధమైన చొరవ తీసుకున్నట్లు ఇండియన్​ బ్యాంక్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎస్​ఎల్​ జైన్ ​ చెప్పారు. చెన్నైలో స్టార్టప్​ స్పెషల్​ సెల్​ను ఆయన లాంఛ్​ చేశారు. ఆ తర్వాత మిగిలిన 9 సిటీలలోని స్పెషల్​ సెల్స్​ను వర్చువల్​గా ప్రారంభించారు. డెడికేటెడ్​ రిలేషన్​షిప్​ మేనేజర్లు స్టార్టప్​ల కోసం ఈ సెంటర్లలో ఉంటారని ఇండియన్​ బ్యాంకు వెల్లడించింది. ఇండ్​ స్ప్రింగ్​బోర్డ్​ పేరుతో ఒక కస్టమైజ్డ్​ లోన్​ ప్రొడక్ట్​ను స్టార్టప్​ల కోసం తెచ్చినట్లు కూడా బ్యాంకు తెలిపింది.