బ్యాంకాక్: వరల్డ్ బాక్సింగ్ రెండో క్వాలిఫయర్స్‌లో ఇండియా బాక్సర్ అంకుషిత బోరో ప్రిక్వార్టర్స్ చేరింది. సోమవారం జరిగిన విమెన్స్ 60 కేజీ తొలి బౌట్‌లో అస్సాంకు చెందిన బోరో 4–-1 తేడాతో నమున్ మొంఖోర్ (మంగోలియా)ను ఓడించింది.
కానీ, మెన్స్ 80 కేజీ అభిమన్యు 0-–5తో ఐర్లాండ్ బాక్సర్ కెలిన్ క్యాసిడీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.
