వీళ్ల తెలివికి సలాం : ATM స్లిప్పులతో ఛాయ్ తాగిన్రు..

 వీళ్ల తెలివికి సలాం : ATM స్లిప్పులతో ఛాయ్ తాగిన్రు..

మీ అకౌంట్ లో రూపాయి కూడా లేదు..కానీ మీకు టీ తాగాలనిపిస్తుంది. ఈ క్రమంలో మీరేం చేస్తారు.. ఇంటికి వెళ్లి ఉన్నదో లేందో దాంతో సరి పెట్టుకుని టీ తాగుతారు. కానీ పెరిగిన టెక్నాలజీని ఉపయోగించి నేటి కుర్రకారులు ప్రతి దానిలో లూప్ హోల్ వెతుకుతున్నారు. నయా పైసా లేకున్నా ఆహార పధార్థాలు ఏలా కొనాలనేదాని పై కొత్త కొత్త టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. అకౌంట్ లో చిల్లి గవ్వ లేకున్న ఇద్దరు మిత్రులు రాయల్ గా టీ తాగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకు అదెలా సాధ్యమనుకుంటున్నారా అయితే పూర్తిగా చదవండి

 ఇద్దరు మిత్రులు కలిసి ఓ ఏటిఏంకు వెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న కార్డుతో మిషన్ లోకి ఇన్ సెట్ చేశారు. దాంట్లో రూపాయి కూడా లేదన్నది గ్రహించారు. ఈ క్రమంలోనే వారికి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. వారేసిన ప్లాన్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఏటీఏంలో కార్డ్ పెట్టి స్లిప్పులు కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. అలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదుల సార్లు చేసి చివరకు ఒ మూటలా తయారు చేశారు. అక్కడ వారు సమకూర్చిన స్లిప్పులన్ను ఓ పేపర్లు కొనే కొనే షాపుకు తీసకెళ్లారు. 

అక్కడ వాటికి కాంట వేయించి వాటికి బదులు డబ్బులు తీసుకున్నారు. ఇంకేముంది వ్యాపారి పేపర్ స్లిప్పులకు రూ. 20 ఇచ్చాడు. అక్కడి నుంచి నేరుగా ఛాయ్ కొట్టు దగ్గరకు వెళ్లి ఎంచక్కా ఫ్రీ టీని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అబ్బాయిలు తమ సమస్యకు పరిష్కారం కనుగొనడం చాలా తెలివైన పని అని కొందరు అంటుంటే, మరికొందరు కేవలం ఒక కప్పు టీ తాగడానికి చాలా కష్టాలు పడ్డారని కామెంట్ చేస్తున్నారు.