దిస్పూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద తొలిసారిగా అస్సాంలో ఉంటున్న బంగ్లాదేశ్‌కు చెందిన 40 ఏండ్ల మహిళకు భారత పౌరసత్వం లభించింది. అస్సాంలో సీఏఏ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విదేశీయులకు భారత పౌరసత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి అని సీనియర్ అడ్వకేట్, ఫారినర్స్ ట్రిబ్యునల్(ఎఫ్‌టీ) మాజీ మెంబర్ ధర్మానంద దేబ్ వెల్లడించారు.
‘‘2007లో సదరు మహిళ బెనర్జీ ఇంటిపేరుతో తన కుటుంబసభ్యులకు వైద్య చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోని సిల్చార్ కు వచ్చింది. అనంతరం కరీంగంజ్ జిల్లా వ్యక్తిని పెళ్లి చేసుకొని, అక్కడే నివాసం ఉంది. తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఆమె కుటుంబం ఉంటోంది. గతేడాది సీఏఏ నిబంధనలు నోటిఫై అయ్యాక సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా.. డీలిమిటేషన్ వల్ల రిజెక్ట్ అయ్యింది. మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఆమోదం పొందింది” అని ఆయన తెలిపారు.
