బంగాళాఖాతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

బంగాళాఖాతంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా యావత్ భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నింగి నేల అన్న తేడా లేకుండా  వజ్రోత్సవ వేడుకులను జరుపుకుంటున్నారు.  తాజాగా పశ్చిమబెంగాల్ మత్స్యకారులతో కలిసి  భారత తీర రక్షక దళం అధికారులు బంగాళాఖాతంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా  జాతీయ జెండాను ఎగురవేశారు. వందేమాతరం పాట ప్లే అవుతుంటే..కోస్ట్ గ్వార్డ్ అధికారులు, మత్స్య కారులు  జాతీయ జెండాను సెల్యూట్ చేశారు.