సముద్రం మధ్యలో తగలబడిన బోటు

సముద్రం మధ్యలో తగలబడిన బోటు

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన  వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ సిబ్బంది ఘటనా జరిగిన స్థలం దగ్గరకు వెళ్లారు. అప్పటికే బోటుపూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో బోటులో చేపల వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు  సముద్రంలోకి దూకేశారు.  

సముద్రంలో చిక్కుకున్న   11 మంది మత్స్య కారులను  కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడి  సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. మంటల్లో కాలిపోయిన బోటు కాసేపటికే సముద్రంలో మునిగిపోయింది.   దాదాపు 40 లక్షల విలువైన పడవ కాలిపోయినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.   ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నవంబర్ 19న   విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 48 బోట్లు దగ్ధం అయిన సంగతి తెలిసిందే..30 బోట్లు పూర్తిగా.. 18 బోట్లు పాక్షికంగా దగ్ధం అయ్యాయి.