దేశంలో 47 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 47 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత రోజురోజూకూ పెరుగుతూనే ఉంది. గత అయిదు రోజుల నుంచి దేశంలో 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 94,372 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర కుటుంబ మరియు సంక్షేమ శాఖ తెలిపింది. శనివారం నాటి కేసులతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47 లక్షల మార్కును దాటింది. కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదయిన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 47,54,357కి చేరింది. ఇందులో 9,73,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 37,02,596గా ఉంది. శనివారం ఒక్కరోజే 78,399 మంది డిశ్చార్జ్ అయి కోలుకున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 1,114 మంది కరోనాతో మ‌రణించారు. దాంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 78,586కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

శనివారం దేశవ్యాప్తంగా 10,71,702 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దాంతో ఇప్పటివరకు దేశంలో 5,62,60,928 టెస్టులు చేసినట్లు తెలిపింది.

For More News..

రాష్ట్రంలో మరో 2,216 కరోనా పాజిటివ్ కేసులు

క్రెడిట్ కార్డులపై ఫీజుల మోత.. రికవరీ కోసమేనంటున్న బ్యాంకులు

ఐపీఎల్‌లో తొలిసారి అమెరికన్‌ ప్లేయర్