
భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న మూడు ఫార్మా సంస్థల హ్యూమన్ ట్రయల్స్ అడ్వన్స్ డ్ స్టేజ్ కి చేరుకున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు మూడు సంస్థలు ముందంజలో ఉన్నట్లు చెప్పారు.
సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన టీకా హ్యూమన్ ట్రయల్స్ 2వ దశలో ఉన్నట్లు..అదే సంస్థ మూడోదశ ట్రయల్స్ లో 1,700 మంది వాలంటీర్లు పాల్గొనబోతున్నట్లు చెప్పారు. భారత్ బయోటెక్ హ్యూమన్ ట్రయల్స్ రెండో దశ, జైడస్ కాడిలాస్ తయారు చేసిన టీకా హ్యూమన్ ట్రయల్స్ 50 మంది వాలంటీర్లతో 2వ దశను పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు.