చైనా వైద్య పరికరాలపై అనుమానాలు : ప్రమాదంలో హెల్త్‌కేర్ డేటా ?

 చైనా వైద్య పరికరాలపై అనుమానాలు : ప్రమాదంలో హెల్త్‌కేర్ డేటా ?

దేశ భద్రతపై ఆందోళనలు పెరుగుతుండటంతో  ప్రస్తుతం భారత ప్రభుత్వం మారుమూల ప్రాంతాలలో చైనీస్ IoT-ఆధారిత వైద్య పరికరాలపై దృష్టి పెట్టింది, ఇవి కీలకమైన హెల్త్ డేటాను లీక్ చేస్తాయని అలాగే దేశ రక్షణకు హాని కలిగిస్తాయని వెల్లడైంది.  

కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్  ఓ సమావేశంలో జాతీయ భద్రత, డేటా గోప్యతా ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మారుమూలలోని భారతీయ ఆరోగ్య కేంద్రాలలో చైనీస్ IoT- ఆధారిత వైద్య పరికరాల వినియోగం పెరుగుతున్న తీరును పరిశీలించాలని  ఆదేశించారు.

చైనా సంస్థలు, ముఖ్యంగా మెడికల్ ఇమేజింగ్ అండ్  మానిటరింగ్ పరికరాలు డేటాను బయటకు లీక్ చేసే అవకాశం ఉందని, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సెంటర్లలో ఇప్పుడు ఎక్కువగా  ఉపయోగిస్తున్న ఈ పరికరాలు నిఘా, అనధికార డేటా యాక్సెస్‌కు మార్గాలు బయటపడ్డాయి. 

Also Read : గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌.. ఇండిగో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

మారుమూల ప్రాంతాలలో చైనా వైద్య పరికరాల వాడకం వల్ల రోగుల డేటాపై భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. జనాభా ఆరోగ్య డేటాను చైనా సంస్థలు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. (చైనా యాజమాన్యంలోని వైద్య పరికరాలను ఉపయోగించడం, ముఖ్యంగా మారుమూల భారతీయ ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఇన్‌స్టాల్ చేస్తున్న IoT-ఆధారిత ఇమేజింగ్ అండ్ పర్యవేక్షణ పరికరాలు)  సైనిక పరికరాలలో బగ్‌లు ఉండే అవకాశం ఉందనే దాని గురించి డేటా భద్రత, రక్షణ సమస్యల గురించి లేవనెత్తారు. కొన్ని దేశాలు చైనా వంటి దేశ కంపెనీల నుండి పరికరాల దిగుమతులను కూడా నిషేధించాయని పేర్కొన్నారు. 

ఒక అధికారి ప్రకారం,  వైద్య పరికరాలు ఎగుమతి చేసేటప్పుడు మాల్వేర్ లేదా బగ్‌లను పంపించడం చాలా ఈజీ కాబట్టి, ఏ శత్రు దేశమైనా ఈ ట్రిక్‌ని ఉపయోగించి వారికి కావలసినప్పుడు ఆ పరికరాల్లో మాల్వేర్ లేదా బగ్‌లను యాక్టివేట్ చేయవచ్చు. ఇటువంటి పరికరాలను ఉపయోగించి వేలాది మంది రోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయని అర్థం చేసుకోవాలి.  శత్రు దేశాల నుండి వస్తున్న పరికరాలను పరిశీలించాలి. మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించింది ఇంకా దీని గురించి లోతుగా పరిశీలిస్తుంది కూడా. 

సంబంధిత డేటాను పరిశీలన కోసం ఫార్మాస్యూటికల్స్ విభాగం (DoP), పరిశ్రమ & ఇంటర్నల్  వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT), ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) వంటి మంత్రిత్వ శాఖలతో షేర్ చేయాలనీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

భారతదేశంలో చైనీస్ వైద్య పరికరాలు : డేటా ప్రకారం, భారతదేశం వైద్య పరికరాల కోసం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. భారతదేశానికి వైద్య పరికరాల ఎగుమతిదారులలో చైనా రెండవ అతిపెద్దది, చైనా ఎగుమతులు 2023-24లో దాదాపు రూ.11,506 కోట్లు, అదే సంవత్సరంలో అమెరికా  ఎగుమతులు రూ.12,552 కోట్లు అంటే అమెరికా కంటే చైనా కొంచెం తక్కువ.

చైనా నుండి దిగుమతి చేసుకున్న కొన్ని ముఖ్యమైన వైద్య పరికరాలలో పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, డయాగ్నస్టిక్ ఇమేజింగ్ మెషీన్లు (అల్ట్రాసౌండ్ & CT స్కానర్లు వంటివి), ఇన్-విట్రో డయాగ్నస్టిక్ (IVD) కిట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సర్జికల్ పరికరాలు, థర్మామీటర్లు, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు, సిరంజిలు, సూదులు వంటి డిస్పోజబుల్ వస్తువులు ఉన్నాయి. ఈ రంగంలో ప్రముఖ చైనా కంపెనీలలో మైండ్రే, యునైటెడ్ ఇమేజింగ్, యువెల్ & సినోకేర్ టాప్లో ఉన్నాయి.