
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆదివారం ( ఆగస్టు 31 ) ఢిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరిన AI2913 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో తిరిగి వచ్చింది. టేకాఫ్ అయిన వెంటనే ఫైర్ ఇండికేషన్ రావడంతో సుమారు అరగంట సేపు గాల్లోనే ఉండిపోయింది విమానం.
ఘటన జరిగిన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పైలట్ ముందు జాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని తెలిపింది ఎయిర్ ఇండియా.ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.