వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లీ

V6 Velugu Posted on Apr 07, 2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తోంది చైనా స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో. తమ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని నియమిస్తున్నట్లు బుధవారం తెలిపింది. వరల్డ్ వైడ్ గా కోహ్లికి ఉన్న క్రేజ్‌ తమ బ్రాండ్ల ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పింది. కోహ్లి తన కాంట్రాక్ట్‌లో భాగంగా.. సంస్థకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపింది.

 వివో ప్రస్తుతం ఐపీఎల్‌ అఫిషియల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.

Tagged Virat Kohli, vivo

More News