కొత్త ఎడ్టెక్ కంపెనీ..బిగ్ఎకాడమీ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్

కొత్త ఎడ్టెక్ కంపెనీ..బిగ్ఎకాడమీ బ్రాండ్ అంబాసిడర్గా యువరాజ్

హైదరాబాద్​, వెలుగు: బిగ్ అకాడమీ పేరుతో హైదరాబాద్ లో మంగళవారం కొత్త ఎడ్​టెక్ సంస్థ ప్రారంభమైంది. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం హైబ్రిడ్ లెర్నింగ్ విధానాన్ని ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. 

విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించి, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని సంస్థ సీఈఓ రమణ భూపతి తెలిపారు. టెక్నాలజీలను నేర్పించడమేగాక, నిపుణులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో శిక్షణ ఉంటుంది. కేవలం పరీక్షల కోసమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా బోధన సాగుతుంది. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించవచ్చని చెప్పారు.