మార్చి 4 నుంచి హైటెక్స్ లో ఇండియన్ డెయిరీ సౌత్ జోన్ మీటింగ్

మార్చి 4 నుంచి హైటెక్స్ లో ఇండియన్ డెయిరీ సౌత్ జోన్ మీటింగ్

ఖైరతాబాద్​,వెలుగు:  ఇండియన్​డెయిరీ అసోసియేషన్​సౌత్​జోన్​ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి 6  వరకు మూడు రోజులు 50వ డెయిరీ ఇండస్ట్రీ (ఐడీఏ) తెలంగాణ శాఖ సమావేశం సిటీలోని హైటెక్స్​ఎగ్జిబిషన్​సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు సౌత్​జోన్ చైర్మన్ సతీశ్​కులకర్ణి, తెలంగాణ, కరీంనగర్​డెయిరీల చైర్మన్​సీహెచ్​రాజేశ్వరరావు తెలిపారు.

శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులు, ప్రొఫెసర్లు, డెయిరీ పరిశ్రమకు చెందిన సాంకేతిక నిపుణులు, ఆధునిక మెషినరీల తయారీ సంస్థల యజమానులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సదస్సును సీఎం రేవంత్​రెడ్డి  ప్రారంభిస్తారన్నారు.  అనంతరం సదస్సు పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐడీఏ ఉపాధ్యక్షుడు కేఆర్ రావు, దొడ్ల  డెయిరీ సీఈసీ సభ్యుడు బీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.