చిరుతలకు అనుమతిస్తేనే ఇండియాకు వస్తా

చిరుతలకు అనుమతిస్తేనే ఇండియాకు వస్తా

రష్యా దాడులతో ఉక్రెయిన్ లోని లక్షలాది పౌరులు ప్రాణాలు కాపాడుకునేందుకు పొరుగు దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులను ఆపరేషన్ గంగా పేరుతో భారత్ తీసుకొస్తుంది కేంద్రం. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ మాత్రం తాను ఉక్రెయిన్ విడిచి రాలేనంటున్నాడు. తనతోపాటు తాను పెంచుకొనే రెండు చిరుతలను కూడా రానిస్తేనే వస్తానంటున్నాడు. గతంలో ఒకరు కుక్కను, మరొకరు పిల్లిని ఇండియా తీసుకెళ్లేందుకు అనుమతిచ్చినట్లే.. తననూ చిరుతలతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నాడు గిరికుమార్ పాటిల్ అలియాస్ జాగ్వర్ పాటిల్.

ఉక్రెయిన్ వెళ్లేకంటే ముందు తెలుగు, తమిళ్, మళయాలం, హిందీలో పలు సినిమాలు, సీరియళ్లలో నటించాడు గిరికుమార్ పాటిల్. స్టడీ కోసం 2007లో ఉక్రెయిన్ వెళ్లాక పలు ఉక్రెయిన్, రష్యన్ మూవీస్ లోనూ నటించానని చెబుతున్నాడు. రెండు చిరుతలను సొంత పిల్లల్లా పెంచుకున్నానని వాటిని వదిలి ఉండలేనని చెబుతున్నాడు గిరికుమార్. 

మరిన్ని వార్తల కోసం

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్