
కరోనా వైరస్ తో కువైట్‌లో ఓ భారత సంతతికి చెందిన డాక్టర్ చనిపోయారు.54 ఏళ్ల వాసుదేవ రావు అనే భారతీయ డాక్టర్ దుబాయిలోని జబేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 15 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న వాసుదేవ రావు.. కువైట్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కువైట్ ఆయిల్ కంపెనీలో ఎండోడాంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్‌లోని ఇండియన్ డెంటిస్ట్ అలియన్స్(IDA) సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు., భారత్ నుంచి కువైట్‌లోకరోనా తో చనిపోయిన రెండో మెడికల్ ప్రొఫెషనల్ వాసుదేవ రావు.