
ఖాట్మాండు: నేపాల్ రాజధాని ఖాట్మాండులోని ఇండియన్ ఎంబసీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుధవారం గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేపాల్‌లో ఇండియన్ అంబాసిడర్ మంజీవ్‌సింగ్ పురి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేపాల్‌లో ఏర్పాటు చేసిన మొదటి గాంధీజీ విగ్రహం ఇదే అని అధికారులు చెప్పారు. నేపాల్‌లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో గాంధీజీ ప్రభావం బాగా ఉందని మంజీవ్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఖాట్మాండు సిటీ హాల్‌లో గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.