మ్యాచ్ ఫిక్సింగ్ అదిరింది : భారత్-పాక్ గేమ్ లో లవ్ ప్రపోజ్

మ్యాచ్ ఫిక్సింగ్ అదిరింది : భారత్-పాక్ గేమ్ లో లవ్ ప్రపోజ్

తన లవ్ ప్రపోజల్ జీవితాంతం గుర్తుండాలి అనుకున్నాడు ఓ ప్రేమికుడు. అందుకు..వరల్డ్ కప్ ను వేదికగా చేసుకున్న ఆ లవర్ బాయ్.. భారత్, పాక్ మ్యాచ్ లో.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా నిలిచిన ఆట..ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో స్టేడియంలో ఉన్న భారత్ కు చెందిన విక్కీ అనే ప్రేమికుడు ధైర్యం చేశాడు. యావత్తు దేశం ఆనందంలో మునిగిన ఈ క్షణాల కంటే మంచి సందర్భం ఏముంటుంది అనుకున్నాడో ఏమో.. తను ప్రేమించిన అన్విత(ఇండియా) అనే అమ్మాయికి ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. వెంటనే తన జేబులోని రింగ్‌ని తీసి తన ఫ్రెండ్స్, ప్రేక్షకులు చూస్తుండగానే.. అన్విత లవ్ ప్రపోజ్ చేసి చేతికి రింగ్ తొడిగాడు.

మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను తెలిపిన విక్కీ.. ప్రేమకు ఆశ్చర్యపోయిన అన్విత కాదనలేకపోయింది. వెంటనే అతన్ని కౌగిలించుకొని తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీరిద్దరి లవ్ ప్రపోజ్ ను ఫ్రెండ్స్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ..ప్రస్తుతం యమ చక్కర్లు కొడుతుందీ ఈ వీడియో. దీనిపై వివరణ ఇచ్చిన అన్వితా కూడా ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకుంది. దీన్ని చూసిన వారంతా పాక్‌పై ఇండియా మ్యాచ్ గెలిచిన వేళ ఈ ప్రేమికుడి ప్రేమ గెలిచిందంటున్నారు. మ్యాచ్ లో ‘మ్యాచ్‌’ సెట్‌ చేసుకున్నారు అంటూ అభినందనలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా విదేశాల్లో జరగడం కామన్. ఇప్పుడు మనోళ్లు కూడా ఫాలో అవుతున్నారన్నమాట. జూన్ 21న పాక్ తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ విక్టరీ సాధించింది.