చైనాను ఎదుర్కోవడానికి సర్కార్ భయపడుతోంది: రాహుల్

చైనాను ఎదుర్కోవడానికి సర్కార్ భయపడుతోంది: రాహుల్

న్యూఢిల్లీ: లడఖ్‌ రీజియన్‌లో ఇండియా–చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇరు దేశాలు లడఖ్‌ రీజియనక్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి దాదాపు లక్ష మంది సైన్యాన్ని మోహరించాయని సమాచారం. ఈ నేపథ్యంలో లడఖ్‌ ఉద్రిక్తతలపై మరోమారు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మొత్తం దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

‘లడఖ్‌లో చైనాను ముఖాముఖిగా ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భయపడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం చైనా సన్నద్ధమవుతోంది. తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ప్రధానమంత్రి వ్యక్తిగత సాహసంలో లోపంతోపాటు మీడియా మౌనం వల్ల మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.