పాకిస్తాన్కు మరో షాక్.. భారత్లో పాక్ ఓటీటీ కంటెంట్ బ్యాన్.. కేంద్రం ఆదేశం

పాకిస్తాన్కు మరో షాక్.. భారత్లో పాక్ ఓటీటీ కంటెంట్ బ్యాన్..   కేంద్రం ఆదేశం

ఒకవైపు ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత్.. మరో నిర్ణయంతో బిగ్ షాక్ ఇచ్చింది.  భారత్ తో పెట్టుకుంటే అష్టదిగ్బంధనమే అన్నట్లుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది. అందులో భాగంగా పాకిస్తాన్ కు సంబంధించిన సినిమా, వీడియో కంటెంట్ ఏదీ భారత్ లో ప్లే కాకూడదని ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

పాక్ వీడియో కంటెంట్ ఏదీ భారత్ లో ప్లే కాకూడదని ఓటీటీ ప్లాట్ ఫామ్స్, స్ట్రీమింగ్ సర్వీసెస్, డిజిటల్ ఇంటర్మీడియరీస్ ను ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం (మే 8) ఆదేశించింది. అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. 

‘‘దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ, మీడియా ప్లాట్ ఫామ్స్, ఇండియాలో ఉన్న ఇంటర్మీడియరీస్.. పాకిస్తాన్ కు చెందిన వెబ్ సీరీస్, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్ లు, ఇతర మీడియా కంటెంట్ ను నిలిపివేయండి.’’ అంటూ గైడ్ లైన్స్ నోట్ రిలీజ్ చేసింది.

భారత్ సహనాన్ని అలుసుగా తీసుకుని బార్డర్ లో కాల్పులు జరుపుతూ.. అమాయకులను బలితీసుకుంటున్న  పాక్ తో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంది భారత్. అంతేకాకుండా రావాణా మార్గాలను ఆపేసింది. బోర్డర్ ను క్లోజ్ చేయటమే కాకుండా ఇండియాలో ఉంటున్న పాకిస్తానీయులను పంపించింది. 

►ALSO READ | పాకిస్తాన్‎కు బిగ్ షాక్.. మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్

పహల్గాం దాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. బార్డర్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంస చేసిన తర్వాత ఆ దేశం కూడా ఇండియన్ ఆర్మీ క్యాంప్ లను కూల్చేయాలని చూసింది. నిఘా వర్గాల సమాచారంతో.. ముందస్తుగా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్ర స్థావరాలతో పాటు ఆర్మీ బేస్ క్యాంపులను కూడా ధ్వంసం చేసింది ఇండియా. మరోసారి కవ్వింపులకు పాల్పడితే ఈ సారి చుక్కలు చూపిస్తాం అన్నట్లుగా దాడికి దిగింది. పాక్ అమాయక ప్రజలు కాకుండా కేవలం ఉగ్రవాదులే తమ లక్ష్యం అని వారిపైనే దాడులకు దిగింది. 

కానీ మానవత్వం లేని పాక్.. పంజాబ్, జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని అమాయకులను పొట్టన పెట్టుకునేలా దాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్ ను మరింత ఇరుకున పెట్టేందుకు.. భారత్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పేందుకు.. మరో బలమైన నిర్ణయం తీసుకుంది ఇండియా. పాకిస్తాన్ కు సంబంధించిన ఏ ఒక్క వీడియో కంటెంట్ ఇండియాలో ప్రసారం కాకుండా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇండియన్ సినిమాలు, సీరియల్స్, వెబ్ సీరీస్ లో నటించేందుకు అవకాశం లేదని బ్యాన్ విధించిన ఇండియా.. మీడియా, వీడియో కంటెంట్ ను కూడా బ్యాన్ చేయడం గమనార్హం.