పాకిస్తాన్‎కు బిగ్ షాక్.. మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్

పాకిస్తాన్‎కు బిగ్ షాక్.. మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్

న్యూఢిల్లీ: భారత్‎పై ఆకస్మిక దాడులకు దిగిన పాకిస్థాన్‎కు బిగ్ షాక్ తగిలింది. పాక్ ఎయిర్ ఫోర్స్‎కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చి వేసింది. ఒక ఎఫ్ 16 ఫైటర్ జెట్, రెండు JF-17 యుద్ధ విమానాలను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం చేసింది. వీటితో పాటు పలు చోట్ల పాక్ డ్రోన్లను కూడా భారత సైన్యం కూల్చివేసింది. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్ మరియు పఠాన్‌కోట్‌, జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్‌లను వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. పాక్ ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో.. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాగా, గురువారం (మే 8) రాత్రి సరిహద్దు జిల్లాలు పంజాబ్, జమ్ము కాశ్మీర్, రాజస్థాన్‎లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్ము ఎయిర్ పోర్టు, రాజస్థాన్‎లోని జైస్మలేర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా మిస్సైల్, డ్రోన్లతో ఎటాక్ చేసింది. సాంబా జాతీయ రహదారిని టార్గెట్ చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం.. S-400 వైమానిక రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. దీంతో పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలమట్టం చేసింది. ఇప్పటి వరకు 8 మిస్సైళ్లు, పదుల సంఖ్యల డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. పాక్ భీకరంగా దాడులకు పాల్పుడుతుండటంతో భారత్ సైన్యం కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. 

పాక్ దాడుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ సరిహద్దు నగరాల్లో పూర్తిగా బ్లాక్‌ అవుట్ ప్రకటించారు. జమ్ము, జైసల్మేర్‌, జలంధర్‌, అమృత్‌సర్‌లో పూర్తిగా పవర్ కట్ చేశారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జమ్ము కాశ్మీర్, అఖ్నూర్, కుప్వారా జిల్లాలో వార్ సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. 


►ALSO READ | బిగ్ బ్రేకింగ్: భారత్‎పై పాక్ మిస్సైల్, డ్రోన్ ఎటాక్.. 8 క్షిపణులను కూల్చివేసిన ఆర్మీ