లా (Law) చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. హైదరాబాద్ DGFTలో ఖాళీలు!

లా (Law) చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. హైదరాబాద్ DGFTలో ఖాళీలు!

డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్​టీ), హైదరాబాద్ యంగ్ ప్రొఫెషనల్స్ (లీగల్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ (లీగల్). 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 70 శాతం మార్కులతో ఎల్ఎల్ఎం పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
 అప్లికేషన్ ప్రారంభం: జూన్ 10.
లాస్ట్ డేట్: జూన్ 20.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ: జూన్ 30. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ dgft.gov.inను సందర్శించండి.