డేవిడ్‌‌‌‌ అంటన్‌‌‌‌ గుజారో పై గెలుపు

డేవిడ్‌‌‌‌ అంటన్‌‌‌‌ గుజారో పై గెలుపు

అబుదాబి: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. అబుదాబి మాస్టర్స్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌‌‌‌లో అర్జున్‌‌‌‌.. డేవిడ్‌‌‌‌ అంటన్‌‌‌‌ గుజారో (స్పెయిన్‌‌‌‌)పై గెలిచాడు. దీంతో ఏడున్నర పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. వరంగల్‌‌‌‌కు చెందిన అర్జున్‌‌‌‌.. ఆడిన తొమ్మిది రౌండ్లలో ఒక్క గేమ్‌‌‌‌లో కూడా ఓడిపోలేదు.

ఆరు విజయాలు, మూడు డ్రాలు నమోదు చేశాడు. ఇటీవల ముగిసిన చెస్‌‌‌‌ ఒలింపియాడ్‌‌‌‌లోనూ అర్జున్‌‌‌‌ 35 ఎలో రేటింగ్‌‌‌‌ పాయింట్లను సంపాదించి ఆకట్టుకున్నాడు. జావోకిర్‌‌‌‌ సిందరోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌) ఏడు పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌ను సాధించాడు. ఇండియాకే చెందిన నిహాల్‌‌‌‌ సరీన్‌‌‌‌, ఎస్‌‌‌‌పీ సేతురామన్‌‌‌‌, కార్తికేయన్‌‌‌‌ మురళీ, ఆర్యన్‌‌‌‌ చోప్రా ఆరున్నర పాయింట్లను సాధించారు.