రన్నరప్ నీరజ్

రన్నరప్ నీరజ్

దోహా :  ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ తొలి అంచెలో ఇండియా జావెలిన్ స్టార్, ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌‌‌‌ నీరజ్ చోప్రా రన్నరప్‌‌‌‌గా నిలిచాడు. రెండు సెంటీ మీటర్ల తేడాతో టాప్ ప్లేస్ కోల్పోయాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో  నీరజ్ తన చివరి, ఆరో  ప్రయత్నంలో జావెలిన్‌‌‌‌ను 88.36 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం సాధించాడు.  చెక్ రిపబ్లిక్‌‌‌‌కు చెందిన జాకబ్ వాద్లెచ్ 88.38 మీటర్లతో టాప్ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు.

అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 86.62 మీటర్లతో మూడో స్థానం సాధించాడు. ఈ ఈవెంట్‌‌‌‌లో జాకబ్‌‌‌‌, చోప్రా మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. తొలి ప్రయత్నంలో  జాకబ్ 85.87 మీటర్లు విసరగా..నీరజ్‌‌‌‌ ఫౌల్ చేశాడు. రెండోసారి జాకబ్ 86.93 మీటర్లు అందుకోగా.. చోప్రా 84.93 మీటర్లతో సరిపెట్టాడు. తన మూడో ప్రయత్నంలో జాకబ్ అత్యధికంగా 88.38 మీటర్లతో టాప్‌‌‌‌లోకి వెళ్లగా.. నీరజ్ 86.24 మీటర్ల దూరం విసిరాడు.

చివరి రెండు ప్రయత్నాల్లో జాకబ్ ఫెయిలవగా.. ఆరోసారి నీరజ్‌‌‌‌ అతనికి చాలా చేరువగా వచ్చాడు.   ఇండియాకే చెందిన మరో ఆటగాడు కిశోర్ జెనా 76.31 మీటర్లతో  తొమ్మిదో ప్లేస్‌‌‌‌తో నిరాశ పరిచాడు.