
న్యూఢిల్లీ: ఇండియా మెన్స్‌హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు ప్లేయర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు . బెంగళూరులోని సాయ్ సెంటర్‌లో శుక్రవారం మొదలైన నేషనల్ క్యాంప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్లేయర్లకు పరీక్షలు నిర్వహించారు. దీంతో మన్‌ప్రీత్‌తో పాటు డిఫెండర్ సురేందర్‌కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్ కీపర్ క్రిషన్ బహుదుర్ పాథక్‌కు వైరస్ సోకినట్లు తేలింది. సొంత ప్రాంతాల నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో వీళ్లు వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. అయితే వైరస్ సోకిన ప్లేయర్లను పక్కనబెట్టి ఫిట్‌గా ఉండే అథ్లెట్లతో క్యాంప్‌ను రన్‌చేస్తామని సాయ్ ప్రకటించింది. సాయ్ క్యాంపస్‌లోనే తాను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు మన్‌ప్రీత్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నాడు.
For More News..