నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఇంటర్​ ఎంపీసీతోనే కేంద్ర ప్రభుత్వ కొలువులో స్థిరపడేందుకు ఇండియన్​ నేవీ సెయిలర్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ 2022 ఆగస్టులో ప్రారంభమయ్యే బ్యాచ్‌‌ కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి 2500 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 2500, పోస్టులు: ఏఏ (ఆర్టిఫీష‌‌ర్‌‌ అప్రెంటిస్‌‌) – 500, ఎస్ఎస్ఆర్ (సీనియ‌‌ర్ సెకండ‌‌రీ రిక్రూట్స్‌‌) – 2000

అర్హత: 60 శాతం లేదా ఆపైన మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌‌ (10+2) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. 2002 ఆగ‌‌స్టు 1 నుంచి 2005 +31 మధ్య జన్మించి ఉన్న అభ్యర్థులు అర్హులు.

సెలెక్షన్ ప్రాసెస్
ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశ‌‌వ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌‌లైన్ టెస్టులో మెరిట్ ద్వారా, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ కు స్టేట్‌‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌లైన్ టెస్టులో కనీసం 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. పీఎఫ్‌‌టీలో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అనర్హత పొందిన వారు 21 రోజుల లోపు రూ.40 చెల్లించి మిలిటరీ హాస్పిటల్‌‌లో రివ్యూ కోరవచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​ 
ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించే ఈ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 60 నిమిషాలు. ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీల్లో ప్రింట్ చేస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఒక రాంగ్ ఆన్సర్‌‌కు ¼ మార్కు మైనస్ అవుతుంది. సెక్షనల్ కటాఫ్‌‌తో పాటు ఓవరాల్ కటాఫ్ మార్కులు పొందాలి. 

ఫిజికల్ ఫిట్‌‌నెస్ టెస్ట్
పీఎఫ్‌‌టీ గా పిలిచే ఈ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి. 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరిగెత్తడంతో పాటు 20 సిట్‌‌అప్స్, 10 పుషప్స్ తీయాల్సి ఉంటుంది. క్రీడలు, స్విమ్మింగ్, ఇతర కర్రిక్యులర్ యాక్టివిటీస్‌‌లో సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

మెడికల్ స్టాండర్డ్స్ తప్పనిసరి
కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. గాలి పీల్చినప్పుడు చాతీ 5 సెం.మీ. విస్తరించాలి. చెవులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. అద్దాలు ఉన్నా లేకున్నా కంటిచూపు 6/6 గా ఉండాలి. ముంజేతి లోపలి భాగంలో మాత్రమే టాటూలకు అనుమతిస్తారు. శరీరంలో ఏ ఇతర భాగంలో పచ్చ బొట్టు ఉన్నా పరీక్ష రాయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. 

వెబ్​సైట్​: www.joinindiannavy.gov.in