
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ మొర్ముగావ్’ నుంచి ఆదివారం టెస్ట్ ఫైర్ చేసినట్లు నేవీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
‘‘లేటెస్ట్ గైడెడ్ -మిసైల్ డిస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ మొర్ముగావ్’ నుంచి తొలిసారి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను పరీక్షించాం. లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది” అని వివరించారు. ‘‘షిప్, శక్తివంతమైన ఆయుధం.. రెండూ దేశీయంగా తయారైనవే. ఆత్మనిర్భరతకు, సముద్రంలో భారత నావికాదళం శక్తికి ఇదే నిదర్శనం” అని చెప్పారు.