బంగాళాఖాతంలో బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన ఇండియన్ నేవీ

బంగాళాఖాతంలో బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన ఇండియన్ నేవీ

భారత నావికాదళం బుధవారం ( నవంబర్1) సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను విజయవంతంగా పరీక్షించింది.కార్యచరణ సంసిద్ధత టెస్ట్ ఫైరింగ్ సమయంలో లక్ష్యాన్ని బ్రాహ్మోస్ విజయవంతంగా చేరుకుంది. భారత నౌకాదళానికి చెందిన తూర్పు కమాండ్ లోని బంగాళా ఖాతంలో బ్రహ్మోస్ ను విజయవంతంగా పరిక్షించారు. 

ఇది చైనీస్ నావికాదళం బ్లూ వాటర్ , కౌంటర్ ప్రిపరేషన్ కార్యచరణకు సంసిద్ధత. అంతకుముందు కూడా నావికాదళం బ్రహ్మోస్ శ్రేణులను విజయవంతం ప్రయోగించింది. 

సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు

భారతదేశం-రష్యన్ జాయింట్ వెంచర్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు లేదా ల్యాండ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి 2.8 మ్యాక్ వేగంతో లేదా దాదాపు మూడు రెట్లు ధ్వని వేగంతో ప్రయోగించవచ్చు. ఫిలిప్పీన్స్ వంటి కొన్ని దేశాలకు కూడా భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేస్తోంది భారత్. బ్రహ్మోస్ ప్రయోగంతో భారత నావికాదళం విస్తరించిన పరిధి సామర్థ్యాన్ని కూడా పరీక్షించింది.

ALSO READ :- హమాస్ కమాండర్ను హతమార్చాం: ఇజ్రాయెల్ సైన్యం