అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30) దారుణ హత్యకు గురయ్యాడు. టెక్సాస్ లోని ఆస్టిన్‌‌‌‌లో ఓ పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తుండగా..దీపక్ కందేల్ (31) అనే మరో ఇండియన్ ఆయనపై కత్తితో పొడిచి చంపాడు. ఈ నెల14న జరిగిన ఈ  ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షయ్ గుప్తా ఆస్టిన్‌‌‌‌లో ఫుట్‌‌‌‌బిట్ అనే హెల్త్-టెక్ స్టార్టప్‌‌‌‌కు సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

అక్షయ్  బస్సు వెనుక సీటులో కూర్చుని ఉండగా..ఆయనపై దీపక్ హఠాత్తుగా కత్తితో దాడిచేసినట్లు సీసీటీవీల్లో రికార్డయ్యిందన్నారు. దీపక్ పై మర్డర్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నేరాన్ని నిందితుడు అంగీకరించాడన్నారు. అక్షయ్ చూడటానికి తన మామను పోలి ఉన్నందునే మర్డర్ చేశానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.