చిన్నారిపై లైంగిక దాడి ఆరోపణలు..భారతీయ సంతతి పైలట్ అరెస్ట్

చిన్నారిపై లైంగిక దాడి ఆరోపణలు..భారతీయ సంతతి పైలట్ అరెస్ట్

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ పైలట్ అరెస్ట్ చేశారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే కాక్ పిట్ లో ఎంటరైన DHS ఏజెంట్లు మరో మాట లేకుండా పైలట్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు ఇంకా దిగకుండానే వారిని తోసుకుంటూ వెళ్లిను ఏజెంట్లు బ్యాడ్జీలు, గన్స్ తో విమానంలోకి ప్రవేశించి కో పైలట్ ను బంధించారు. అసలు పైలట్ ను ఎందుకు అరెస్ట్ చేశారో పూర్తి వివరాల్లోకి వెళితే.. 

శాన్ ఫ్రాన్సిస్కో: భారతీయ సంతతికి చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్ కో-పైలట్ భగవాగర్‌ను శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే DHS (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ) ఏజెంట్లు, అధికారులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జూలై 27 ఆదివారం నాడు మిన్నియాపాలిస్ నుంచి వచ్చిన డెల్టా ఫ్లైట్ 2809 (బోయింగ్ 757-300) ల్యాండ్ అయిన పది నిమిషాల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. ప్రయాణికులు ఇంకా విమానం దిగకముందే, ఏజెంట్లు వారిని పక్కకు తోసుకుంటూ బ్యాడ్జ్‌లు, తుపాకులతో కాక్‌పిట్‌లోకి వెళ్లి భగవాగర్‌ను బంధించారు.

అరెస్టుకు గల కారణాలు..

కాంట్రా కోస్టా షెరీఫ్ కార్యాలయం ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం..ఒక చిన్నారిపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు తర్వాత డిటెక్టివ్‌లు ఏప్రిల్ 2025 నుండి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భగవాగర్ నిందితుడిగా గుర్తించడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఏప్రిల్‌లో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడితో ఐదుసార్లు నోటి ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భగవాగర్‌పై ఆరోపణలు ఉన్నాయి.ప్రస్తుతం భగవాగర్ మార్టినెజ్ డిటెన్షన్ ఫెసిలిటీ జైలులో ఉన్నారు.

డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందన..

పైలట్ భగవాగర్ అరెస్ట్‌పై డెల్టా ఎయిర్‌లైన్స్ తీవ్రంగా స్పందించింది. "చట్ట విరుద్ధమైన పనులను మేము సహించం. భగవాగర్‌పై వచ్చిన ఆరోపణలు విని షాక్ అయ్యాం. అతనిని తక్షణమే సస్పెండ్ చేశాం" అని డెల్టా అధికారులు ప్రకటించారు.

►ALSO READ | మరోసారి మానవత్వం చాటుకున్న రాహుల్ గాంధీ.. 22 మంది పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయం