- నిందితుడు భారత సంతతి వ్యక్తి
హ్యూస్టన్ : అమెరికాలో నేపాల్ స్టూడెంట్ హత్యకు గురైంది. ఆమెను భారత సంతతి వ్యక్తి కాల్చి చంపాడు. నేపాల్ కు చెందిన మునా పాండే (21) స్టడీ కోసం 2021లో అమెరికా వెళ్లింది. హ్యూస్టన్ లోని కమ్యూనిటీ కాలేజీలో చదువుకుంటున్నది. అక్కడే అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నది. గత సోమవారం మునా పాండే ఫ్లాట్‌కు ఓ దొంగ వచ్చాడు. ఆమె అడ్డుకోవడంతో కాల్పులు జరిపి పరారయ్యాడు.
అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు మునా పాండే డెడ్ బాడీని అపార్ట్మెంట్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు వచ్చి పరిశీలించిన పోలీసులు.. బుల్లెట్ గాయాలతో మునా పాండే చనిపోయిందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఫ్లాట్‌కు దొంగ వచ్చిన విషయం బయటపడింది. అతడిని భారత సంతతికి చెందిన బాబీ సిన్హా షా(52)గా గుర్తించి, హత్యా నేరం కింద అరెస్టు చేశారు.