అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారత సంతతి వ్యక్తి మృతి

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన 42 ఏండ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పంజాబ్‌‌లోని హోషియార్‌‌పూర్ జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్​గా గుర్తించారు. ఈ నెల 12న ఇండియానా పొలిస్ సమీపంలోని గ్రామీణ గ్రీన్‌‌వుడ్‌‌ ఏరియాలో సుఖ్విందర్ సింగ్ తన హోండా అకార్డ్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న లేన్‌‌లోకి వెళ్లి ఎదురుగా వచ్చిన వెహికల్ ను​ఢీకొట్టింది.  దీంతో సింగ్​కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 13న మృతిచెందాడు. అలాగే, ఎదురుగా వచ్చిన కారు డ్రైవర్, కారులో ఉన్న మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా ట్రీట్​మెంట్​ కోసం ఆస్పత్రికి తరలించారు.