యూకేలో యంగెస్ట్ సొలిసిటర్గా భారత సంతతి యువతి

యూకేలో యంగెస్ట్ సొలిసిటర్గా భారత సంతతి యువతి

న్యూఢిల్లీ: భార‌‌త సంత‌‌తికి చెందిన యువతి క్రిషాంగి మేష్రామ్​కు అరుదైన గౌర‌‌వం ద‌‌క్కింది. ఇంగ్లండ్ అండ్ వేల్స్‌‌లో అత్యంత పిన్న వయసున్న సొలిసిట‌‌ర్​గా ఆమె క్వాలిఫై అయ్యారు. 21 ఏండ్ల వ‌‌య‌‌సుకే ఆమె యంగెస్ట్ సోలిసిట‌‌ర్​గా రికార్డు సృష్టించారు. క్రిషాంగి 15 ఏండ్ల వయసులోనే మిల్టన్ కీన్స్‌‌లోని ది ఓపెన్ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించడం ప్రారంభించారు.

18 ఏండ్ల వయసులో న్యాయశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందారు. ఈ సందర్భంగా క్రిషాంగి.. ఓపెన్ వర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ఎల్ బీని15 ఏండ్లకే ప్రారంభించడానికి అవకాశం ఇచ్చినందుకు ఓపెన్ వర్సిటీకి ధన్యవాదాలు చెప్పారు. క్రిషాంగి మేష్రామ్ బెంగాల్‌‌లో జన్మించారు. ఓపెన్ యూనివ‌‌ర్సిటీ ద్వారా ఆమె లాను చదువుకోవడం ప్రారంభించారు.18 ఏండ్ల వ‌‌య‌‌సుకే ఫ‌‌స్ట్ క్లాస్ ఆన‌‌ర్స్ డిగ్రీ అందుకుని అతిపిన్న వయసులోనే ఓపెన్ వర్సిటీ లా గ్రాడ్యుయేట్​గా రికార్డు సృష్టించారు.