 
                                    
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. నవంబర్ 13, 14వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 
పోస్టుల సంఖ్య: 46 (హాస్పిటాలిటీ మానిటర్స్).
ఎలిజిబిలిటీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎం అండ్ సీటీ)/ యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి ఉండాలి.
అర్హత: మినిస్ట్రీ టూరిజం పరిధిలోని సంస్థ నుంచి పాకశాస్త్రంలో బీబీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2025, నవంబర్ 13, 14వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు irctc.com వెబ్సైట్లో సంప్రదించగలరు.

 
         
                     
                     
                    