ఇండియన్ రైల్వేస్ 2023--24 ఆర్థిక సంవత్సరానికి జోన్ల వారీగా వచ్చిన ఆదాయాన్ని ప్రకటించింది. సెంట్రల్ రైల్వే జోన్ వరుసగా మూడో సారి రూ.122.35 కోట్ల రాబడితో ముందంజలో ఉంది. సెంట్రల్ రైల్వే జోన్ అనేక వినూత్న కార్యక్యమాలతో ఈ స్థానాన్ని దక్కించుకుంది. వూలూ టాయిలెట్ల అమలు, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ సౌకర్యాల కల్పించడం, ఫార్మసీలతో అత్యవసర మెడికల్ సెంటర్ల ఏర్పాటు, క్యాటరింగ్, స్టేషన్ లో అమ్మే వస్తువులపై ట్యాక్స్, BOXN వ్యాగన్ల శుభ్రపరిచే ఒప్పందాలు వంటి నాన్-ఫేర్ రాబడి పెంచుకుంటూనే ఇంత ఆదాయాన్ని సంపాధించింది.
రైల్వే సెంట్రల్ జోన్ హైడ్ క్వాటర్ ముంబైలో ఉంది.
సెంట్రల్ రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాని టార్గెట్ రూ.102.80 కోట్లు ఉండగా.. దానికి మించి రూ.122.35 కోట్ల సంపాదనతో భారతీయ రైల్వేలోని అన్ని జోన్‌లలో అత్యధిక నాన్-ఫేర్ రెవెన్యూ (NFR) ఆదాయాన్ని సాధించింది.
గతేడాది ఆదాయం రూ.87.44 కోట్ల ఉంటే.. దానికి 39.9శాతం ఎక్కువ సాధించింది. ఈ రికార్డ్ సాధించడానికి సెంట్రల్ జోన్ రైల్వే అనేక సర్వీసులు రైల్వే ప్రయాణికులకు అందించింది.రాబడి ఉత్పత్తిలో భాగస్వామ్యాలు మరియు సహకారాలు కీలక పాత్ర పోషించాయి. యాప్-ఆధారిత క్యాబ్ సేవలు, స్లీపింగ్ పాడ్‌లు, ఏడు వేర్వేరు ప్రదేశాలలో రెస్టారెంట్-ఆన్-వీల్స్ అనేటువంటి ప్రొగ్రామ్స్ కీలక పాత్రను పోషించాయి.